97 : 1
إِنَّآ أَنزَلْنَـٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో[1] అవతరింపజేశాము.[2]
97 : 2
وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ
మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు?
97 : 3
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.[1]
97 : 4
تَنَزَّلُ ٱلْمَلَـٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[1], తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు.
97 : 5
سَلَـٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ
ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.