87 : 1
سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى
అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!
87 : 2
ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ
ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.[1]
87 : 3
وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ
మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు[1], మరియు మార్గం చూపాడు!
87 : 4
وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ
మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.
87 : 5
فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ
మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]
87 : 6
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ
మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -
87 : 7
إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ
అల్లాహ్ కోరింది తప్ప[1]! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
87 : 8
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.[1]
87 : 9
فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]
87 : 10
سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.
87 : 11
وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.
87 : 12
ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ
అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.
87 : 13
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.[1]
87 : 14
قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.
87 : 15
وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ
మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.
87 : 16
بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا
అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;
87 : 17
وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰٓ
కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.
87 : 18
إِنَّ هَـٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ
నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;
87 : 19
صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ
ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.