84 : 1
إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ
ఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు![1]
★
84 : 2
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.[1]
★
84 : 3
وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;
★
84 : 4
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;
★
84 : 5
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.
★
84 : 6
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَـٰقِيهِ
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.
★
84 : 7
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ بِيَمِينِهِۦ
అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;[1]
★
84 : 8
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.
★
84 : 9
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًا
మరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!
★
84 : 10
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَـٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ
ఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;[1]
★
84 : 11
فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًا
అప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;
★
84 : 12
وَيَصْلَىٰ سَعِيرًا
మరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.
★
84 : 13
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا
వాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]
★
84 : 14
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
వాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.
★
84 : 15
بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا
అలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.
★
84 : 16
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ
కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]
★
84 : 17
وَٱلَّيْلِ وَمَا وَسَقَ
రాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!
★
84 : 18
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ
పూర్ణచంద్రుని సాక్షిగా![1]
★
84 : 19
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
మీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]
★
84 : 20
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
అయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?
★
84 : 21
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ ۩
మరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?[1]
★
84 : 22
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ
అలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.
★
84 : 23
وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
మరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
★
84 : 24
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -
★
84 : 25
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ
విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.
★