82 : 1
إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ
ఆకాశం చీల్చబడినప్పుడు![1]
82 : 2
وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ
మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!
82 : 3
وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!
82 : 4
وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ
మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!
82 : 5
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.
82 : 6
يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ
ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?
82 : 7
ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ
ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.
82 : 8
فِىٓ أَىِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ
తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.
82 : 9
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ
అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!
82 : 10
وَإِنَّ عَلَيْكُمْ لَحَـٰفِظِينَ
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.[1]
82 : 11
كِرَامًا كَـٰتِبِينَ
వారు, గౌరవనీయులైన లేఖకులు;
82 : 12
يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
మీరు చేసేదంతా తెలుసుకునేవారు!
82 : 13
إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ
నిశ్చయంగా పుణ్యాత్ములు[1] సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.
82 : 14
وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍ
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.[1]
82 : 15
يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ
తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.
82 : 16
وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ
మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.
82 : 17
وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
82 : 18
ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ
అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
82 : 19
يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ
ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.[1]