37 : 1
وَٱلصَّـٰٓفَّـٰتِ صَفًّا
వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!
★
37 : 2
فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا
మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా![1]
★
37 : 3
فَٱلتَّـٰلِيَـٰتِ ذِكْرًا
ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా![1]
★
37 : 4
إِنَّ إِلَـٰهَكُمْ لَوَٰحِدٌ
నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే![1]
★
37 : 5
رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَـٰرِقِ
ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.[1]
★
37 : 6
إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ
నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;
★
37 : 7
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَـٰنٍ مَّارِدٍ
మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి; [1]
★
37 : 8
لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు.
★
37 : 9
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
(ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.
★
37 : 10
إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ
కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది.[1]
★
37 : 11
فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ ۚ إِنَّا خَلَقْنَـٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ
అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
★
37 : 12
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు.
★
37 : 13
وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ
మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.
★
37 : 14
وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ
మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు.
★
37 : 15
وَقَالُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"
★
37 : 16
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
"ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?"
★
37 : 17
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
"ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?"
★
37 : 18
قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ
వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు." [1]
★
37 : 19
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.
★
37 : 20
وَقَالُوا۟ يَـٰوَيْلَنَا هَـٰذَا يَوْمُ ٱلدِّينِ
మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
★
37 : 21
هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!" [1]
★
37 : 22
۞ ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ
(దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని -
★
37 : 23
مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ
అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;
★
37 : 24
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْـُٔولُونَ
మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది.
★
37 : 25
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు?'"
★
37 : 26
بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ
అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు.
★
37 : 27
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.
★
37 : 28
قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ
కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!"[1]
★
37 : 29
قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ
ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు."
★
37 : 30
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَـٰنٍۭ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَـٰغِينَ
"మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు[1]."
★
37 : 31
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖ إِنَّا لَذَآئِقُونَ
"కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము."
★
37 : 32
فَأَغْوَيْنَـٰكُمْ إِنَّا كُنَّا غَـٰوِينَ
"కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి[1]!"
★
37 : 33
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు.
★
37 : 34
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము.
★
37 : 35
إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ
వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు.
★
37 : 36
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ
మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"[1]
★
37 : 37
بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ
వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.
★
37 : 38
إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ
నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;
★
37 : 39
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు -
★
37 : 40
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.[1]
★
37 : 41
أُو۟لَـٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది;[1]
★
37 : 42
فَوَٰكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;
★
37 : 43
فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ
పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;
★
37 : 44
عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ
ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు, [1]
★
37 : 45
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ
వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి;
★
37 : 46
بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّـٰرِبِينَ
అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;
★
37 : 47
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.
★
37 : 48
وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ
మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.[1]
★
37 : 49
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.[1]
★
37 : 50
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.
★
37 : 51
قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ
వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు;
★
37 : 52
يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ
అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?
★
37 : 53
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَدِينُونَ
ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
★
37 : 54
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా?"
★
37 : 55
فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ
తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.
★
37 : 56
قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే!
★
37 : 57
وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ
ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని."
★
37 : 58
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
(తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?
★
37 : 59
إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?"
★
37 : 60
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).[1]
★
37 : 61
لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ ٱلْعَـٰمِلُونَ
ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి.
★
37 : 62
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ
ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు[1] ఆతిథ్యమా?
★
37 : 63
إِنَّا جَعَلْنَـٰهَا فِتْنَةً لِّلظَّـٰلِمِينَ
నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.
★
37 : 64
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ
నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;
★
37 : 65
طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَـٰطِينِ
దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి.
★
37 : 66
فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు.
★
37 : 67
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది[1].
★
37 : 68
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ
ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది.
★
37 : 69
إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ
నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు!
★
37 : 70
فَهُمْ عَلَىٰٓ ءَاثَـٰرِهِمْ يُهْرَعُونَ
మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని!
★
37 : 71
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు.
★
37 : 72
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.
★
37 : 73
فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُنذَرِينَ
ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో!
★
37 : 74
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప!
★
37 : 75
وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ
మరియు వాస్తవంగా, నూహ్[1] మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము.
★
37 : 76
وَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.[1]
★
37 : 77
وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ
మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]
★
37 : 78
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
★
37 : 79
سَلَـٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَـٰلَمِينَ
సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)!
★
37 : 80
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
★
37 : 81
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.
★
37 : 82
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
తరువాత మేము ఇతరులను ముంచి వేశాము.
★
37 : 83
۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ
మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు.
★
37 : 84
إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ
అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;
★
37 : 85
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ
అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు?
★
37 : 86
أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ
ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?
★
37 : 87
فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ
అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?"
★
37 : 88
فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ
ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు;[1]
★
37 : 89
فَقَالَ إِنِّى سَقِيمٌ
అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు."[1]
★
37 : 90
فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ
కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.
★
37 : 91
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి?"
★
37 : 92
مَا لَكُمْ لَا تَنطِقُونَ
"మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?"
★
37 : 93
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు.[1]
★
37 : 94
فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ
అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు.
★
37 : 95
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
★
37 : 96
وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
"వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"[1]
★
37 : 97
قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَـٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ
వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!"
★
37 : 98
فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَسْفَلِينَ
కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.
★
37 : 99
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ
మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు."[1]
★
37 : 100
رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّـٰلِحِينَ
(అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!"
★
37 : 101
فَبَشَّرْنَـٰهُ بِغُلَـٰمٍ حَلِيمٍ
కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.[1]
★
37 : 102
فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَـٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَـٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰبِرِينَ
ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
★
37 : 103
فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ
ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.
★
37 : 104
وَنَـٰدَيْنَـٰهُ أَن يَـٰٓإِبْرَٰهِيمُ
మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్!
★
37 : 105
قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.
★
37 : 106
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْبَلَـٰٓؤُا۟ ٱلْمُبِينُ
నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష.
★
37 : 107
وَفَدَيْنَـٰهُ بِذِبْحٍ عَظِيمٍ
మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.[1]
★
37 : 108
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.
★
37 : 109
سَلَـٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ
"ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
★
37 : 110
كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
★
37 : 111
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు!
★
37 : 112
وَبَشَّرْنَـٰهُ بِإِسْحَـٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّـٰلِحِينَ
మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.[1]
★
37 : 113
وَبَـٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَـٰقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ
మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.[1]
★
37 : 114
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము.
★
37 : 115
وَنَجَّيْنَـٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
★
37 : 116
وَنَصَرْنَـٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ
మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.
★
37 : 117
وَءَاتَيْنَـٰهُمَا ٱلْكِتَـٰبَ ٱلْمُسْتَبِينَ
మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.[1]
★
37 : 118
وَهَدَيْنَـٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
★
37 : 119
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ
మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము.
★
37 : 120
سَلَـٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
"మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)!"
★
37 : 121
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
★
37 : 122
إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.
★
37 : 123
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.[1]
★
37 : 124
إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ
అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
★
37 : 125
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَـٰلِقِينَ
ఏమీ? మీరు బఅల్ [1] (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా?
★
37 : 126
ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా?"
★
37 : 127
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు.
★
37 : 128
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
★
37 : 129
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
★
37 : 130
سَلَـٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ
"ఇల్ యాసీన్ [1] కు శాంతి కలుగు గాక (సలాం)!"
★
37 : 131
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.
★
37 : 132
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.[1]
★
37 : 133
وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ
మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.[1]
★
37 : 134
إِذْ نَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో -
★
37 : 135
إِلَّا عَجُوزًا فِى ٱلْغَـٰبِرِينَ
ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.[1]
★
37 : 136
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము.
★
37 : 137
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;[1]
★
37 : 138
وَبِٱلَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?
★
37 : 139
وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
మరియు నిశ్చయంగా, యూనుస్[1] కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.
★
37 : 140
إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;[1]
★
37 : 141
فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.
★
37 : 142
فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.[1]
★
37 : 143
فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ
అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే![1]
★
37 : 144
لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు.
★
37 : 145
۞ فَنَبَذْنَـٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ
ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము.
★
37 : 146
وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము. [1]
★
37 : 147
وَأَرْسَلْنَـٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.
★
37 : 148
فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَـٰهُمْ إِلَىٰ حِينٍ
వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.[1]
★
37 : 149
فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ
అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?[1]
★
37 : 150
أَمْ خَلَقْنَا ٱلْمَلَـٰٓئِكَةَ إِنَـٰثًا وَهُمْ شَـٰهِدُونَ
లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా?"[1]
★
37 : 151
أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
★
37 : 152
وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ
"అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు!
★
37 : 153
أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ
ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా?[1]
★
37 : 154
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
★
37 : 155
أَفَلَا تَذَكَّرُونَ
ఏమీ? మీరు గ్రహించలేరా?
★
37 : 156
أَمْ لَكُمْ سُلْطَـٰنٌ مُّبِينٌ
లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
★
37 : 157
فَأْتُوا۟ بِكِتَـٰبِكُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ
మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
★
37 : 158
وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు.[1] కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
★
37 : 159
سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)![1]
★
37 : 160
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
★
37 : 161
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
★
37 : 162
مَآ أَنتُمْ عَلَيْهِ بِفَـٰتِنِينَ
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు;
★
37 : 163
إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
★
37 : 164
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ
(దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
★
37 : 165
وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.
★
37 : 166
وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ
మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే![1]
★
37 : 167
وَإِن كَانُوا۟ لَيَقُولُونَ
మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
★
37 : 168
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ
"ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!"
★
37 : 169
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
"మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!"
★
37 : 170
فَكَفَرُوا۟ بِهِۦ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
★
37 : 171
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ
మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;
★
37 : 172
إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ
నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని!
★
37 : 173
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَـٰلِبُونَ
మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని![1]
★
37 : 174
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
★
37 : 175
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
★
37 : 176
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
★
37 : 177
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ
కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
★
37 : 178
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు;
★
37 : 179
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
★
37 : 180
سُبْحَـٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ
నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
★
37 : 181
وَسَلَـٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ
మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
★
37 : 182
وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ
మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు!
★